tank bund వద్ద వైఎస్ షర్మిల మౌన దీక్ష.. అరెస్ట్, బొల్లారం పీఎస్కు తరలింపు
ys sharmila arrest:వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను (ys sharmila) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు మహిళా దినోత్సవం కావడంతో ఫిల్మ్ నగర్లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించారు. తర్వాత ట్యాంక్ బంద్ వద్ద ఉన్న రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ట్యాంక్ బండ్ వద్ద షర్మిల (ys sharmila) మౌనదీక్షకు దిగగా.. అరెస్ట్ చేశారు.
ys sharmila arrest:వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను (ys sharmila) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు మహిళా దినోత్సవం (womens day) కావడంతో ఫిల్మ్ నగర్లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించారు. తర్వాత ట్యాంక్ బంద్ వద్ద ఉన్న రాణి రుద్రమదేవి (rani rudramadevi) విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ట్యాంక్ బండ్ వద్ద షర్మిల (ys sharmila) మౌనదీక్షకు దిగారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘయిత్యాలపై నిరసనగా సాయంత్రం వరకు దీక్ష చేపడతానని ప్రకటించారు. నల్ల బ్యాడ్జీలతో దీక్షకు దిగగా.. పోలీసులు అరెస్ట్ (arrest) చేశారు. షర్మిల దీక్షను భగ్నం చేసి.. బొల్లారం పోలీస్ స్టేషన్కు (bollaram ps) తరలించారు. అక్కడినుంచి లోటస్ పాండ్లో (lotus pand) గల నివాసానికి తరలిస్తున్నట్టు తెలిసింది.
అంతకుముందు ట్యాంక్ బండ్ వద్ద షర్మిల (ys sharmila) మాట్లాడారు. అత్యాచారాల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా నిలిచిందని విమర్శించారు. మహిళలను (womens) ఎత్తుకుపోవడంలో కూడా మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత (protection) లేదన్నారు. రాష్ట్రంలో ఏటా 20 వేల అత్యాచారాలు జరుగుతున్నాయని వివరించారు. మహిళలు (womens) అంటే ఓటు వేసే యంత్రాలుగా కేసీఆర్ (cm kcr) చూస్తున్నారని పేర్కొన్నారు. మహిళల భద్రతకు చిన్న దొర కేటీఆర్ (ktr) భరోసా యాప్ (bharosa) అని చెప్పాడు.. మరీ ఎక్కడుంది ఆ యాప్ అని అడిగారు. తన మొబైల్లో చెక్ చేశా…ఎక్కడ కనపడలేదన్నారు.
రాష్ట్రంలో అధికార పార్టీ నేతలే అత్యాచారాలకు పాల్పడుతున్నారని షర్మిల (ys sharmila) విమర్శించారు. గత 5 ఏళ్లలో వేల కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు (workers) మహిళలపై అత్యాచారాలు చేశారని వివరించారు. కేటీఆర్ (ktr) నియోజక వర్గంలో మైనర్ల అత్యాచారం జరిగిందన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలు అత్యాచారం జరిగిందని గుర్తుచేశారు. ఆడపిల్లలపై కన్నెత్తి చూస్తే గుడ్లు పీకుత అని చెప్పిన సీఎం కేసీఆర్ (cm kcr) ఎంత మంది గుడ్లు పీకారని షర్మిల అడిగారు. మంత్రుల బంధువులు రేప్ చేశారని ఆరోపించారు.
దళిత మహిళలు అని చూడకుండా దాడులు చేస్తున్నారని షర్మిల (sharmila) ఆరోపించారు. ఆ సామాజిక వర్గానికి చెందిన మహిళలను లాకప్ డెత్ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలు గవర్నర్ (governer) మీదనే అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ (women commission) ఒక డమ్మీగా మారిందని చెప్పారు. తానే స్వయంగా మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసినా దిక్కు లేదన్నారు. ఒకరు మరదలు అని.. మరొకరు ఫ్యాషన్ షో అన్నారని గుర్తుచేశారు. ఇంకొకరెమో కొజ్జా అని తిట్టాడని.. తమ బస్సులు తగుల బెట్టారని తెలిపారు. రాష్ట్రంలో ఐఏఎస్ మహిళ అధికారులకు కూడా గౌరవం లేదని షర్మిల అన్నారు. మహిళా ఉపాధ్యాయులకు గౌరవం లేదన్నారు. పోడు భూములకు పట్టాలు అడిగితే చంటి బిడ్డల తల్లులను జైల్లో పెట్టారని పేర్కొన్నారు.