ఓ వ్యక్తి తన బైక్‌పై ఆవును కూర్చోబెట్టుకుని బైక్ రైడింగ్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆవు ఆ బైక్‌పై కుదురులా అలా ఎలా కూర్చుందని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఓ వ్యక్తి తన బైక్‌పై ఆవును కూర్చోబెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్న (Driving) వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. సాధారణంగా పెంపుడు జంతువుల్ని కార్లు, సైకిళ్లు, బైక్‌లపై కూర్చోబెట్టుకుని తీసుకెళ్లడం చూస్తూనే ఉంటాం. కానీ ఓ ఆవును బైక్ పై కూర్చోబెట్టుకుని బైక్ నడపడం అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది.
నరేష్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఓ యువకుడు తన బైక్‌పై ఆవును కూర్చోబెట్టుకున్నాడు. ఆవును ముందు ఉంచుకుని ఆ యువకుడు బైక్ రైడ్ చేశాడు. ఆ రైడ్‌లో ఆవు ఆ యువకుడికి ఏ ఇబ్బంది కలిగించకుండా ప్రశాంతంగా ఉంది. అందుకే ఆ యువకుడు కాన్ఫిడెంట్‌గా ఆ బైక్‌ని నడుపుతూ ఎంజాయ్ చేశాడు. ఆవు మోహంలో ఎటువంటి ఆందోళన, భయం కూడా కనపడలేదు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఆ ఆవును ఆ యువకుడు బైక్‌పై అలా కుదురుగా ఎలా కూర్చోబెట్టాడని నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొందరు మాత్రం అలా బైక్ రైడ్ చేయడం తప్పని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ (Video Viral) అవుతోంది.