»The Father Took His Daughters Dead Body On A Bike
Video Viral: కూతురి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన తండ్రి!
ఆస్పత్రి సిబ్బంది సహకరించకపోవడంతో చేసేదేమీ లేక లక్ష్మణ్ సింగ్ తన కుమార్తె మృతదేహాన్ని బంధువు సహాయంతో బైక్‌పైనే తరలించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.
అంబులెన్సు(Ambulance)కు డబ్బులు ఇవ్వలేక ఓ తండ్రి తన చిన్నారి మృతదేహాన్ని(Deadbody) బ్యాగులో పెట్టుకుని బస్సులో ప్రయాణించిన ఘటన అందరికీ తెలిసిందే. ఆ ఘటన మరువకముందే అలాంటిదే మరొకటి చోటుచేసుకుంది. ఓ తండ్రి తన కూతురి మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.
కూతురి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన తండ్రి వీడియో:
MP | Shahdol
लक्षमण सिंह गोंड (आदिवासी) की 13 साल की बेटी माधुरी की सिकल सेल बीमारी से मौत हो गई।
एंबुलेंस मांगने पर अस्पताल में कहा: अनुमति 15 किमी तक की है 70 किमी के लिए अपना इंतज़ाम करो।
प्राइवेट एंबुलेंस बजट में नहीं था तो लक्षमण बेटी का शव बाइक पर लेकर चल पड़े।
మధ్యప్రదేశ్ షాదోల్ జిల్లాలోని కోట గ్రామంలో లక్ష్మణ్ సింగ్ గౌడ్ నివశిస్తున్నాడు. అతని కుమార్తె మాధురి గౌడ్ మే 12వ తేదీన తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఆమెను షాదోల్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. రెండు రోజుల చికిత్స తర్వాత ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని గ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ సమకూర్చాలని ఆస్పత్రి వైద్యులకు లక్ష్మణ్ గౌడ్ విన్నవించుకున్నాడు. అయితే వారు అంబులెన్స్ సమకూర్చకపోగా కేవలం 15 కిలో మీటర్ల వరకూ అంబులెన్స్(Ambulance) పంపుతామని చెప్పారు.
తమ గ్రామానికి తీసుకెళ్లాలంటే 70 కిలోమీటర్ల వరకూ ప్రయాణించాల్సి ఉంది. ఆస్పత్రి సిబ్బంది సహకరించకపోవడంతో చేసేదేమీ లేక లక్ష్మణ్ సింగ్ తన కుమార్తె మృతదేహాన్ని బంధువు సహాయంతో బైక్‌పైనే తరలించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది. ఈ వీడియోపై జిల్లా కలెక్టర్ వందన వైద్య క్షణాల్లో స్పందిస్తూ.. లక్ష్మణ్ సింగ్‌ను మార్గమధ్యలోనే ఆపారు. జిల్లా ఆస్పత్రి సివిల్ సర్జన్ డాక్టర్ జీఎస్ పరిహార్‌కు ఫోన్ చేసి, అంబులెన్స్(Ambulance) సమకూర్చాలని ఆదేశాలు ఇవ్వడంతో చివరికి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ఆ తర్వాత బాధిత కుటుంబానికి కలెక్టర్ ఆర్థిక సాయం అందించారు.