ప్రేమ విమానం(Prema Vimanam) వెబ్ ఒరిజినల్ చిత్రం టీజర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు(Mahesh Babu) ఈరోజు(ఏప్రిల్ 27న) రిలీజ్ చేశారు. టీజర్ వీడియోలో మనం కూడా విమానం ఎక్కాలిరా అంటున్న పిల్లల సంభాషణ..నీ చెవులంటే మస్తు ఇష్టమని చెబుతున్న హీరో డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఈ క్రమంలో ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
మహిళలు(women) ప్రయాణించేందుకు టూ వీలర్ బైక్(bike) బుక్ చేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే ఇటీవల ఓ రాపిడో(rapido) డ్రైవర్(driver) ఓ యువతి విషయంలో అసభ్యంగా ప్రవర్తించినట్లు వెలుగులోకి వచ్చింది. ఆ క్రమంలో ఆమె ఏకంగా ప్రయాణిస్తున్న బైక్ పై నుంచి దూకడం సంచలనంగా మారింది.
చంద్రబాబు(chandrababu naidu) గురించి పరోక్షంగా నరమాంసం తినే పులి ముసలిదైపోయిందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm Jagan mohan reddy) వ్యాఖ్యానించారు. ఈరోజు అనంతపురం జిల్లా నార్సలలో ఏర్పాటు చేసిన జగనన్న వసతి దీవెన నిధుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పేర్కొన్నారు. మరోవైపు చదువుల కోసం ఓ ఒక్కరూ కూడా అప్పులు చేయకూడదని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
అఖిల్ ఏజెంట్(agent) సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.ఈ సినిమా ఐటెం సాంగ్ రీసెంట్ విడుదల చేశారు. దీనిలో ఊర్వశీ రౌతలా(Urvashi Rautela) ఆడిపాడారు.
విద్యార్థులు..సమాజం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి మ్యూజిక్ స్కూల్ మూవీ గుర్తు చేసినట్లు అనిపిస్తుంది. ఈరోజు హీరో విజయ్ దేవరకొండ విడుదల చేసిన ఈ ట్రైలర్ చూస్తే మీకే తెలుస్తుంది. ఈ చిత్రం మే 12 , 2023న తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో రిలీజ్ కానుంది.
ప్రముఖ హీరోయిన్ తమన్నా(tamannaah), బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ(vijay varma) కలిసి డేటింగ్(dating)లో ఉందని ప్రచారం జరుగుతోంది. ముంబైలో వీరిద్దరూ కలిసి నిన్న కారులో వెళుతున్న క్రమంలో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే గత ఏడాది నుంచి వీరు కలిసి తిరుగుతుండటం పట్లు నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అవెంటో మీరు కూడా ఓసారి చూడండి.
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి జిమ్‌లో స్టెప్పులేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కర్ణాటకలో ఎన్నికల ప్రచారం జరుగుతుండగా ఎమ్మెల్యే ఎంబీ పాటిల్ ఓ యువకుడిపై చేయిచేసుకున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.