»Harassment By Rapido Driver Young Girl Jumped From The Bike At Bengaluru
Rapido driver: వేధింపులు.. బైక్‌పై నుంచి దూకిన యువతి
మహిళలు(women) ప్రయాణించేందుకు టూ వీలర్ బైక్(bike) బుక్ చేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే ఇటీవల ఓ రాపిడో(rapido) డ్రైవర్(driver) ఓ యువతి విషయంలో అసభ్యంగా ప్రవర్తించినట్లు వెలుగులోకి వచ్చింది. ఆ క్రమంలో ఆమె ఏకంగా ప్రయాణిస్తున్న బైక్ పై నుంచి దూకడం సంచలనంగా మారింది.
ఓ రాపిడో బైక్ డ్రైవర్(rapido bike driver) చేసిన ఉదంతానికి మహిళ(women) ఏకంగా ప్రయాణిస్తున్న బైక్ పై నుంచి దూకేసింది. ఇక అసలు వివరాలేంటో ఇప్పుడు చుద్దాం. బెంగుళూరుకు చెందిన 30 ఏళ్ల మహిళ.. రాపిడో బైక్ డ్రైవర్ లైంగిక వేధింపులకు గురిచేశాడని, దాని కారణంగా తాను కదులుతున్న వాహనంపై నుంచి దూకాల్సి వచ్చిందని ఆరోపించింది. ఈ సంఘటన యలహంకలో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డ్రైవర్ తనను అనుచితంగా తాకి, తనను పట్టుకుని లైంగికంగా వేధించాడని ఆమె పేర్కొంది. డ్రైవర్ తనను తాకడం ఆపకపోవడంతో బైక్‌పై నుంచి దూకాల్సి వచ్చిందని ఆమె తెలిపింది. ఈ ఘటన ఏప్రిల్ 21న జరగగా, యలహంక న్యూటౌన్ పోలీస్ స్టేషన్లో ఈ సంఘటనపై ఫిర్యాదు నమోదైంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సంఘటన రాత్రి 11:10 గంటల ప్రాంతంలో జరుగగా డ్రైవర్ మొదట మహిళను కలిశాడు. రైడ్‌ను ప్రారంభించడానికి OTP (వన్-టైమ్ పాస్వర్డ్)ను తనిఖీ చేయాలనే సాకుతో అతను ఆమె ఫోన్ తీసుకున్నాడు. ఆమెను ఇందిరానగర్ నుంచి దొడ్డబళ్లాపురకు డ్రాప్ లొకేషన్‌ను మార్చాడు. యువతి నగరంలో ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తుండడంతో డ్రైవర్ తనను తప్పు ప్రదేశానికి తీసుకెళ్తున్నాడని అనుమానించి ఆమె అతని నుంచి ఫోన్ అడిగింది. బైక్ డ్రైవర్ గంటకు 60 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లాడని మహిళ చెప్పింది.
డ్రైవర్ తాగి ఉన్నాడని తెలుసుకున్న మహిళ తన ఫోన్‌ను లాక్కుంది. కానీ అతను బైక్(bike)ను మరింత వేగంగా నడపడంతో ఆమె BMS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (BMSIT) సమీపంలో దూకాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ క్రమంలో ఆమె దూకిన వీడియో ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఆమె స్వగ్రామంలో ఉన్న స్నేహితుడిని ఇందిరానగర్‌లోని మరో స్నేహితురాలిని పిలిపించడంలో గార్డ్లు, ఇతర బాటసారులు ఆమెకు సహాయం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో చక్కర్లు కోడుతుంది.
మరోవైపు గర్ల్‌ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ సమస్య అని చెప్పి పోలీసులు తమకు సహాయం చేయడానికి నిరాకరించారని మహిళ స్నేహితురాలు ఆరోపించింది. ఫిర్యాదు చేయడానికి JB నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లామని, అయితే తన స్నేహితుడి ఫోన్ ట్రేస్ కాలేదని పోలీసుల(police)కు చెప్పిందని ఆమె చెప్పింది. మరోవైపు బైక్ డ్రైవర్ రాపిడో అప్లికేషన్‌తో హోండా యాక్టివాను రిజిస్టర్ చేసుకున్నాడు. కానీ అతను బజాజ్ పల్సర్ బైకులో మహిళను తీసుకెళ్లడానికి వచ్చాడు. డ్రైవర్‌ను దీపక్ రావు (27)గా పోలీసులు గుర్తించారు.
#WATCH| Bengaluru, Karnataka: Woman jumps off a moving motorbike after the rapido driver allegedly tried to grope her & snatched her phone
On 21st April, woman booked a bike to Indiranagar, driver allegedly took her phone on pretext of checking OTP & started driving towards… pic.twitter.com/bPvdoILMQ2