మహారాష్ట్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నారు. పిడుగులు(Thunderbolts) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Weather Department) ముందస్తు హెచ్చరికలు చేసింది. ఈ తరుణంలో మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో పిడుగుపాటుకు ఒకరు మృతిచెందారు. మైదాన ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై పిడుగు పడటంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలాడు. సెకన్ల వ్యవధిలోనే ఆ కార్మికులు ప్రాణాలు పోయాయి.
పిడుగుపడి కార్మికుడు మృతిచెందిన వీడియో:
పిడుగుపాటుకు కార్మికుడి ప్రాణాలు పోయిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న ఓ సీసీటీవీ(CCTV) కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా భద్రావతి తాలూకా మాజ్రీ బొగ్గు గని వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది.
బొగ్గు గనిలో పనిచేస్తున్న కార్మికుడు తన డ్యూటీ అయిపోయాక పనిచేసే ప్రదేశం నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. అంతలోనే ఆకాశం నుంచి ప్రకాశవంతమైన మెరుపు ఆ కార్మికుడిపై పడింది. పిడుగుపాటుకు ఒక్కసారి వేల వాట్ల విద్యుత్ అతని శరీరంపై పడటంతో ఆ కార్మికుడు చనిపోయాడు. ప్రాణాలు కోల్పోయిన కార్మికుడు బీహార్‌కు చెందిన బాబుధన్ యాదవ్‌గా గుర్తించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Video Viral) అవుతోంది.