శివుని మెడలో నాగుపాము ఉంటుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. తాజాగా శివుని విగ్రహం మెడపై నిజమైన నాగుపాము చుట్టుకొని స్థానికులను ఆశ్చర్యపరిచింది. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన పరమేశ్వరుడి విగ్రహానికి పాము చుట్టుకుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవడం కోసం ఇప్పటి యువత చేస్తున్న పిచ్చిపనులను చూస్తూనే ఉన్నాయి. ఓ యువతి కూడా దానికోసమే తాపత్రయపడి తన పెంపుడు జంతువుకు బలవంతంగా బీర్ తాగించింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ వద్ద స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి జెండాను ఎగరేశారు. జెండా తలకిందులుగా ఉండగా.. దానికి సెల్యూట్ చేశారు.
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఆదివారం (సెప్టెంబర్ 17) సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలను కింది వీడియోలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రారంభించారు. దీంతో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1200 పై చిలుకు గ్రామాలకు తాగునీరు అందింది.
మహేంద్ర సింగ్ ధోనీ ఓ యంగ్ క్రికెటర్‌కు లిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన బైక్ రైడింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ధోని చేసిన పనికి అందరూ ఆయన్ని మెచ్చుకుంటున్నారు.
అమీర్ ఖాన్ తన మొదటి భార్య రీనా దత్తాతో కలిసి ముంబైలోని ఓ నగల షాప్ బయట సందడి చేశారు. ఇద్దరు నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. తరువాత ఇద్దరు కలిసి ఒకే కారులో వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనిపై బాలీవుడ్ లో తెగ చర్చ నడుస్తుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ చక్కర్లు కోడుతుంది.
మెక్సికన్ కాంగ్రెస్ లో వెయ్యేళ్లకు చెందిన ఏలియన్స్ అస్తి పంజరాలు ప్రదర్శనకు పెట్టారు. దీనిపై ఇప్పుడు ప్రపంచం మొత్తం చర్చిస్తుంది. వాటి నుంచి శాస్త్రవేత్తలు డీఎన్ఏ ఆధారాలను శాస్త్రవేత్తలు సేకరించారు.