మతపరమైన ఊరేగింపులో భాగంగా AIMIM, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తమ కరీంనగర్ ఆఫీస్ పై దాడికి ప్రయత్నించారని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. అలాంటి క్రమంలో వారిపై పోలీసులు చర్యలు తీసుకోకుండా తమ పార్టీ నేతలను అరెస్టు చేయడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆసియా క్రీడల్లో(asian games 2023) స్క్వాష్ ఫైనల్ పోరులో చిరకాల ప్రత్యర్థి జట్టు పాకిస్తాన్ ను ఓడించి భారత్ స్వర్ణ పతకం గెల్చుకుంది. పాకిస్తాన్ జట్టును 2-1 తేడాతో ఓడించింది.
ఓ యువతిపై వ్యక్తి దాడి చేస్తూ విపరీతంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జుట్టు పట్టుకొని లాగి, మహిళ బట్టలు చించిమరీ విపరీతంగా కొట్టాడు. అక్కడున్న వారు ఎవరూ అడ్డుకోకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఒక పార్కుకు తన కుమారిడి పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు వెళ్లిన ఓ తల్లికి వింత అనుభవం ఎదురైంది. ఆ పార్కులో తన కుమారుడి కోసం ఏర్పాటు చేసిన ఆహారాన్ని గమనించిన ఓ ఎలుగుబంటి అక్కడకు వచ్చి మొత్తం ఫుడ్ తినేసింది.