Kotha Manohar Reddy Made Another Time Hot Comments
Kotha Manohar Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త మనోహర్ రెడ్డి (Kotha Manohar Reddy) ఆరోపణల దుమారం కొనసాగుతోంది. మహేశ్వరం టికెట్ కోసం చిగురితం పారిజాత నర్సింహారెడ్డి వద్ద రూ.10 కోట్లు, 5 ఎకరాల భూమిని రేవంత్ తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రోజే రేవంత్ చిట్టాను బయట పెడతానని మనోహర్ రెడ్డి స్పష్టంచేశారు. తాజాగా మరో ఇద్దరు నేతల గురించి మీడియాకు వివరించారు.
అప్లికేషన్ వద్దా..?
కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున కసిరెడ్డి నారాయణ రెడ్డి బరిలోకి దిగాలని అనుకుంటున్నారని మనోహర్ రెడ్డి వివరించారు. టికెట్ ఆశించేందుకు అభ్యర్థులు రూ.50 వేలు కట్టారని.. మరీ నారాయణ రెడ్డి నగదు చెల్లించరా..? అడిగారు. అలా డబ్బులు చెల్లంచలే.. కానీ లైన్ క్లియర్ కావడానికి రేవంత్ రెడ్డికి రూ.6 కోట్లు సమర్పించారని ఆరోపించారు. రేవంత్‌కు నేరుగా డబ్బులిస్తే.. ఏ అప్లికేషన్‌కు నగదు చెల్లించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. టికెట్ల కోసం ఇంకా చాలా మంది వద్ద రేవంత్ రెడ్డి నగదు తీసుకున్నారని చెబుతున్నారు.
రూ.12 కోట్లు.. మంత్రి పదవీ
పటాన్ చెరు నుంచి పోటీ చేయాలని భావిస్తోన్న అనిల్ కుమార్ కూడా భారీగా నగదు ముట్టజెప్పారని ఆరోపించారు. ఈయన అయితే ఏకంగా రూ.12 కోట్లు రేవంత్‌కు అందజేశారని వివరించారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. రేవంత్ సీఎం అవుతాడట.. అనిల్‌కు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని చెప్పారని పేర్కొన్నారు. భారీగా డబ్బులు ఇవ్వడంతో ఏకంగా రెవెన్యూ మంత్రి పదవీ ఇస్తానని మాట ఇచ్చారని మనోహర్ రెడ్డి వివరించారు. టికెట్ల పేరుతో చాలా మంది నేతలను మభ్యపెట్టి.. నగదు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
భాగ్యలక్ష్మీ టెంపుల్ వద్దకు రా
అంతేకాదు.. తాను చేసిన ఆరోపణలు తప్పు అని అనుకంటే.. భాగ్యలక్ష్మీ గుడి వద్ద ప్రమాణం చేయాలని మరోసారి సవాల్ విసిరారు. హుజురాబాద్ ఎన్నిక సమయంలో హడావిడి చేసిన రేవంత్.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాడని ప్రశ్నించారు. డబ్బులు తీసుకున్న అంశానికి సంబంధించి ఢిల్లీ వెళ్లి ఈడీ, సీబీఐకి వివరాలు అందజేస్తానని చెప్పారు. ఏం జరిగిందో విచారణ చేయాలని కోరతానని ప్రకటించారు.
కసిరెడ్డి నారాయణ రెడ్డి దగ్గర 6 కోట్లు, గాలి అనిల్ కుమార్ దగ్గర రేవంత్ రెడ్డి 12 కోట్ల రూపాయలు తీసుకున్నాడు
రేవంత్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి. ఇటీవల మహేశ్వరం టికెట్ కోసం చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి దగ్గర 10 కోట్లు, 5 ఎకరాల భూమి… pic.twitter.com/fgn4b9HET2
చెప్పేవి నీతులు
రేవంత్ ఏమీ తప్పులు చేయని వ్యక్తి కాదని.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికారని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక సమయంలో రూ.50 లక్షలు ఇస్తూ పట్టుబడ్డాడని గుర్తుచేశారు. ఇదీ రేవంత్‌కు కొత్త కాదని అంటున్నారు. తనకు డబ్బులు ఇచ్చిన వారికి సర్వేలో చూపిస్తూ. నిజమైన కాంగ్రెస్ నేతలను రేవంత్ మోసం చేస్తున్నాడని ఆరోపించారు. ఇదే అంశంపై రాహుల్ గాంధీ, సోనియా గాంధీని మరోసారి వేడుకున్నారు. రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
దుమారం
తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త మనోహర్ రెడ్డి ఆరోపణల అంశం తీవ్ర కలకలం రేపుతోంది. రోజుకో నేత పేరు తీసుకొచ్చినప్పటికీ ఆ పార్టీ అధినేత మాత్రం స్పందించడం లేదు. ఆరోపణలు చేసిన వ్యక్తిని సస్పెండ్ చేసి.. సైలెంట్‌గా ఉన్నారు. ఈ ఆరోపణలు ఏ వైపు దారి తీస్తాయో చూడాలీ.