అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తడబడ్డారు. టైలర్ స్విప్ట్ పేరు బదులు బ్రిట్నీ అంటూ పలికారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. బైడెన్ తీరును నెటిజన్లు ఏకీపారేస్తున్నారు.
బిలియనీర్ బిల్ గేట్స్ మురుగు కాలువ లోనికి వెళ్లారు. అక్కడ వ్యర్థాల నిర్వహణ గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాదం అందరినీ కలచివేసింది. నవంబర్ 12న యమునోత్రి హైవేలోని సిల్క్యారా బ్యాండ్ సమీపంలో సిల్క్యారా టన్నెల్ ముఖద్వారం లోపల 200 మీటర్ల దూరంలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 41 మంది కూలీలు అక్కడ చిక్కుకుపోయారు. అయినప్పటికీ, వారికి ఆహారం, ఆక్సిజన్ నిరంతరం సరఫరా చేయబడుతున్నాయి. తాజాగా సొరంగం లోపల నుంచి తొలి వీడియో బయటకు వచ్చింది. అందులో చిక్కుకున్న కూలీల పరిస్థితి ఎలా ఉందో మీరే...
యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు క్యారియర్ గెలాక్సీ లీడర్ షిప్ ను హైజాక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించిన వీడియో ఫుటేజీని విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.
ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న తొలి నికరాగువా మహిళగా షెన్నిస్ పలాసియోస్ నిలిచింది. నికరాగ్వా అందాల భామ షేనిస్ పలాసియోస్ మిస్ యూనివర్స్ 2023గా ఎన్నికైంది. మిస్ యూనివర్స్ 2023గా ఎంపికైన షేనిస్ ఆ ఘనత సాధించిన తొలి నికరాగ్వా మహిళగా రికార్డులకెక్కింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌనులో షేనిస్ మెరిసింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ థర్డ్ సీజన్ సెకండ్ ఎపిసోడ్ యానిమల్ ప్రోమోని తాజాగా రిలీజ్ చేసింది ఆహా. . యానిమల్ ట్రైలర్ డేట్ కూడా లాక్ చేసినట్టుగా తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్స్ సల్మాన్-కత్రినా కూడా ఇలానే ముంబయిలోని ఓ థియేటర్‌కు వెళ్లి ఆడిపాడారు. వీళ్లు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘టైగర్-3’. తాజాగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుని మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ముంబయిలోని థియేటర్‌కు వెళ్లి అక్కడ అభిమానులతో ముచ్చటించింది. అభిమానుల కోరిక మేరకు ఆ సినిమాలోని ఓ పాటకు హుషారైన స్టెప్పులు వేసి కత్రినా-సల్మాన్ అలరించారు.
బిగ్ బాస్ హౌస్‌లో పెద్దమనిషిలా ఉన్న శివాజీ టాస్క్‌లో సహనం కోల్పోయాడు. సంచాలక్‌గా వ్యవహరించిన శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్‌పై అరిచాడు. ఆ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది.
పిల్లలతో ప్రధాని మోడీకి ఉన్న అనుబంధాన్ని ఎవరు దాచలేరు. అతను తరచుగా పబ్లిక్ ఈవెంట్లలో పిల్లలతో సరదాగా గడపడం మనం చూడవచ్చు. అలాంటి వీడియోనే తాజాగా మోడీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వావ్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రేజీ వీడియోను మీరు కూడా చూసేయండి మరి.
బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ వేశారు. ప్రస్తుతం ఆమె డ్యాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బెల్లి డ్యాన్స్ వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతుంది. డ్రమ్స్ బీట్‌ను తన డ్యాన్స్‌తో డామినేట్ చేసిన ఈ సుందరి ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇది చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు చూసేయండి మరి.
అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న భారత సంతతీకి చెందిన వివేక్ రామస్వామి నీటిపై సర్ఫింగ్ చేశారు. ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ కాజ్ సాయర్‌తో కలిసి చేసిన ఈ సాహాసం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే దీనిపై మీ కామెంట్ తెలియజేయండి మరి.