»President Joe Biden Mixes Up Taylor Swift And Britney Spears
Joe Biden: మరోసారి తడబడ్డ బైడెన్.. టేలర్ స్విప్ట్ బదులు బ్రిట్నీ అంటూ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తడబడ్డారు. టైలర్ స్విప్ట్ పేరు బదులు బ్రిట్నీ అంటూ పలికారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. బైడెన్ తీరును నెటిజన్లు ఏకీపారేస్తున్నారు.
President Joe Biden mixes up Taylor Swift and Britney Spears during turkey pardon speech
Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) వయస్సు ఎక్కువే.. సోమవారం 81వ వడిలోకి అడుగిడాడు. వయసు పెరగడంతో తడబడుతుంటారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో అలా పొరబడ్డారు. తాజాగా మరోసారి కూడా అలా తప్పులో కాలేశారు. ఇంకేముంది సోషల్ మీడియాలో ఆ వీడియో షేర్ చేయడంతో.. నెటిజన్లు ఏకీ పారేస్తున్నారు. ఇక చాలు రెస్ట్ తీసుకో.. బైడెన్ అంటున్నారు. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.
వైట్ హౌస్లో సోమవారం థాంక్స్ గివింట్ కార్యక్రమంలో బైడెన్ (Biden) మాట్లాడారు. టేలర్ స్విప్ట్ గురించి చెప్పాల్సిన సమయంలో బ్రిట్నీ అనేశారు. ఆ సమయంలో లేదా అంటూనే బ్రిట్ని పేరు పలికారు. ఆ వీడియోకు నెటిజన్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు. బైడెన్ ఇక చాలు సెలవు తీసుకో అని ఒకరు.. మరి ఇంత మతిమరుపా అని మకొరు రాశారు. అగ్రరాజ్య అధ్యక్షుడు ఇలా మాట్లాడితే ఎలా అని మరొకరు కామెంట్ చేశారు.
Joe Biden mistakes Taylor Swift for Britney Spears in turkey pardoning speech:
“This is harder than getting a ticket to the Renaissance tour, or for Britney’s tour…it’s kind of warm in Brazil right now”
ఓకే తాతయ్య.. మీరు మంచం ఎక్కండని ఒకరు.. అతనిని ఆఫీసు నుంచి పంపించేయాలని, లిటరల్లీ అడుక్కుంటున్నాడని ఘాటుగా రాశారు. బైడెన్ దేశం కోసం పరుగెత్తడం లేదని మరొకరు రాశారు. ఓ అధ్యక్షుడు ఇలాంటి తప్పు ఎలా చేస్తాడని ఇంకొకరు.. అతను ప్రతీసారి తప్పు చేస్తాడు.. అతనికి ఏమైనా 190 ఏళ్లు ఉన్నాయా అని ఇంకొకరు ప్రశ్నించారు. బైడెన్ నుంచి మీరు ఏమీ ఆశిస్తున్నారని రాశారు. అతను తికమక అయ్యారని మరొకరు రాశారు. నెటిజన్ల కామెంట్లతో ఆ వీడియో ఇన్ బాక్స్ నిండిపోయింది.