నేడు టెక్నాలజీని చూసి ఆనందపడాలో భయపడాలో తెలియని పరిస్థితి వచ్చింది. ఏఐ టెక్నాలజీతో ఫేస్ మార్పింగ్ వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇది వరకే హీరోయిన్ రష్మికాకు చెందిన ఓ వీడియో వైరల్ కాగా దానిపై పలువురు సెలబ్రెటీలు స్పందించారు. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురిలో భయం మొదలైంది.
ఆస్పత్రిలో తన చెల్లెలు చనిపోతే ఓ అన్న బైక్‌పై మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్స్ లేదని వైద్యులు చెప్పడంతో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌ను నిలదీస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ పాల్గొన్న రోడ్ షోలో అపశృతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రచార వాహనం రెయిలింగ్ విరిగి పడడంతో పై నుంచి సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డి కిందపడ్డారు.
దేశ రాజధాని దిల్లీ (Delhi)లో వాయు నాణ్యత దారుణంగా క్షీణిస్తోంది. ప్రస్తుత పరిస్థితిపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) స్పందించారు.
అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‍లో వస్తున్న మూడో మూవీ గుంటూరు కారం. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. తాజాగా గుంటూరు కారం నుంచి దమ్ మసాలా అంటూ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.
ఓ మహిళ తన ప్రియుడి పేరును నుదుటిపై టాటూ వేయించుకుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఇటివల ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా ఆమెకు అరుదైన సంఘటన ఎదురైంది. వేదికపై నిలిచిన ఆమెకు పుష్పాలు లేని పుష్పగుచ్చాన్ని ఓ నేత ఇవ్వగా అది గమనించిన ఆమె పువ్వలేవని ప్రశ్నించారు. అది చూసిన అక్కడి నేతలు నవ్వుకున్నారు. దీంతోపాటు ప్రియాంక కూడా నవ్వారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లోకనాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో వస్తున్న సినిమా టైటిల్ అఫీషియల్‌గా రివీల్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
సీఎం స్టాలిన్ సర్కార్‌పై అన్నాడీఎంకే సీనియర్ నేత వినూత్నంగా ఒంటెద్దు బండిపై ప్రయాణించి నిరసన తెలిపారు. అయితే దీనిపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూగ జీవాలను ఇలా చేయడం ఏంటని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు.
ఎక్కడైనా డబ్బులు, బంగారం దొంగతనం చేస్తారు. లేదంటే ఏదైనా వస్తువులను దొంగతనం చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా నిర్మాణంలో ఉన్న రోడ్డునే దొంగతనం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మాస్ మహారజా రవితేజ. దసరాకు టైగర్ నాగేశ్వర రావుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మాస్ రాజా.. సంక్రాంతికి ఈగల్‌గా ఆడియెన్స్ ముందుకు రానున్నాడు. తాజాగా ఈగల్ టీజర్ రిలీజ్ చేశారు.
రైతుల పొలాల మంటలను నివారించాలని వెళ్లిన ఓ అధికారికి వింత అనుభవం ఎదురైంది. ఆ క్రమంలో ఓ ప్రాంతానికి వెళ్లిన అధికారిని ఆపిన రైతులు..అతనిచే వరి కుప్పను తగులబెట్టించారు. ఈ సంఘటనను ఓ రైతు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..అక్కడి సీఎం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో సాంగ్ విడుదలైంది. ఇది చూసిన ఫ్యాన్స్ అదిరిందని అంటున్నారు. అయితే ఈ ప్రోమో వీడియో ఎలా ఉందో మీరు కూడా ఓసారి లుక్కేయండి మరి.