Viral Video: గత కొంత కాలంగా మెట్రో రైళ్లు, రైల్వే ప్లాట్‌ఫారమ్‌లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్స్ చేసే ట్రెండ్ వేగంగా పెరిగింది. పశ్చిమ బెంగాల్లో రద్దీగా, కదులుతున్న రైలు కంపార్ట్మెంట్లో ఒక యువతి భోజ్‌పురి పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఆ యువతిని సహేలీ రుద్రగా గుర్తించారు. వీడియోలో, ఆమె చొక్కా, చిరిగిన జీన్స్ ధరించి ప్రయాణికులతో నిండిన సీట్ల మధ్య ఖేసరీ లాల్ యాదవ్ పాట ‘సాజ్ కే సావర్ కే’పై డ్యాన్స్ ఇరగదీసింది. ఆ కంపార్టుమెంట్ లో ఉన్న వాళ్లంతా ఆమెను ఆసక్తిగా చూస్తున్నారు. మరికొందరు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు రికార్డు చేయడం కనిపించింది.
షేర్ చేసినప్పటి నుండి వీడియోకు 2.5 లక్షలకు పైగా లైక్‌లు, 11 మిలియన్లకు పైగా వ్యూయర్ షిప్ వచ్చింది. ఈ వీడియోపై సోషల్ మీడియా వినియోగదారులు భిన్నమైన స్పందనలు వ్యక్తం చేశారు. కొంతమంది మెచ్చుకున్నారు. మరికొందరు విమర్శించారు. మరి కొంతమంది రీల్ షూట్ చేయడానికి ఎంచుకున్న లొకేషన్‌ను ప్రశ్నించగా. .. చాలా మంది ఇటువంటి కార్యకలాపాలను ఒక విసుగుగా భావించారు. ఇంకొందరు రైళ్లలో డ్యాన్స్ వీడియోలను ఎందుకు చిత్రీకరిస్తున్నారు? ‘లోకల్ రైళ్లు, స్టేషన్లలో రీల్స్ తయారు చేయడంపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.