కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్తసాగారాలు దాటి సైడ్ బి ట్రైలర్ విడుదల అయింది. చేయని నేరానికి డబ్బు ఆశతో జైలు వెళ్లిన హీరో బయటకు వచ్చి ఏం చేశాడనేదే సైడ్ బి. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ ఎలా ఉందో చూసేయండి మరి.
ఢిల్లీలోని రోహిణిలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సు పలు ద్విచక్ర వాహనాలను ఢీకొని నుజ్జునుజ్జయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉండే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. తన డ్యాన్స్‌తో అలరించారు. తన సొంతూరికి చెందిన కళాకారులతో జానపద గీతానికి నృత్యం చేసి సందడి చేశారు.
ప్రముఖ హీరో కమల్ హాసన్, శంకర్ కాంబోలో వస్తున్న భారతీయుడు2 చిత్రం నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ మూవీ ఇంట్రో వీడియోను రిలీజ్ చేయగా..ఇది చూసిన అభిమానులు అదుర్స్ అని అంటున్నారు. అయితే ఈ వీడియో ఎలా ఉందో మీరు కూడా ఓసారి చూసేయండి మరి.
శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా ఫామ్ లోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. భారత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో ఇప్పటివరకు అందరికంటే భారీ సిక్సర్ కొట్టిన ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు.
బెడ్ పై నిద్రిస్తున్న ఓ వృద్ధుడిపైకి కాలుతున్న పేపర్ ను విసిరేసిందో మహిళ.. బెడ్ పైన బట్టలకు మంటలు అంటుకుని ఆ వృద్ధుడు చనిపోవాలనే ఉద్దేశంతో ఈ పని చేసిందని ఆమె భర్త ఆరోపిస్తున్నాడు.
కాళేశ్వరం(kaleshwaram) లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో మరో లీకేజీ వెలుగులోకి వచ్చింది. మొన్న మేడిగడ్డ బ్యారేజీ సంఘటన మరువక ముందే తాజాగా అన్నారం సరస్వతి బ్యారేజీలో నీటి లీకేజీ కలకలం రేపుతోంది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తెలంగాణలో నిరుద్యోగం రోజురోజుకి ఎంత పెరిగిపోతుందో అనడానికి ఈ వీడియో నిదర్శనమని చెప్పవచ్చు. ఒకే ఒక్క పోస్ట్‌కు ఓ కంపెనీ వాక్ ఇన్ ఇంటర్వూ నిర్వహించగా వందలాది మంది నిరుద్యోగులు వచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బెంగళూరులో గల ఓ మాల్‌లో మైనర్ బాలిక పట్ల నీచుడు మిస్ బిహేవ్ చేశాడు. క్షణకాలంలో వచ్చి అమ్మాయికి డ్యాష్ ఇచ్చి, చేతు పెట్టి.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ వీడియోను సింగర్ చిన్మయ్ షేర్ చేసి.. మండిపడింది.
ఓ మహిళ పెంపుడు కుక్కను రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ లిఫ్ట్‌లోకి వద్దని వారించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెద్దదైంది. ఆ క్రమంలో ఆఫీసర్ చేతిలోని ఫోన్ మహిళ లాక్కోవడంతో అతను ఆమెపై చేయిచేసుకున్నాడు. ఆ క్రమంలో ఆమె భర్త వచ్చి అతనిపై దాడి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సల్మాన్ ఖాన్, క్రిస్టియానా రొనాల్డో ఇద్దరు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచారు. టైసన్ ఫ్యురీ, ఫ్రాన్సిస్ నాగన్‌నౌ మధ్య జరిగిన ఈ బాక్సింగ్ మ్యాచ్‌ను చూసేందుకు సౌదీ అరేబియాకు వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఓ ఒంటరి ఏనుగు వీధుల్లో తిరుగుతూ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అప్పటికే ఏనుగు పలు గ్రామాల్లో ఆస్తి నష్టం కలిగించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు
సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలు చూస్తుంటే ఒక్కోసారి గూస్ బంప్స్ వస్తాయి. మరి కొన్ని వీడియోలు నిద్రపట్టకుండా చేస్తాయి. కొండచిలువ దగ్గరికి వస్తే భయపడిపోతాము. మొసలి కనిపిస్తే పరుగెత్తుతాము.. ఇక పులి తారస పడితే అంతే సంగతులు.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే కచ్చితంగా షాక్ అవుతారు.
పాకిస్థాన్ యూట్యూబర్ అలిజా సహర్ చిక్కుల్లో పడింది. ప్రైవేట్ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.