»Cm Siddaramaiah Dances With Sontoorolla Video Goes Viral
Hampi : సొంతూరోళ్లతో సీఎం సిద్ధరామయ్య డ్యాన్సు.. వీడియో వైరల్
ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉండే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. తన డ్యాన్స్‌తో అలరించారు. తన సొంతూరికి చెందిన కళాకారులతో జానపద గీతానికి నృత్యం చేసి సందడి చేశారు.
కర్ణాటకలోని హంపిలో కర్ణాటక (Karnataka) రాజ్యోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనదైన శైలిలో డ్యాన్స్ (Dance) చేసి అందరినీ అలరించారు. ఆయన గతంలోనూ పలు సందర్భాల్లో డ్యాన్సులు చేశారు. తాజాగా కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమంలో ఓ సంప్రదాయ గీతానికి సిద్ధరామయ్య (Siddaramaiah) కాలు కదిపిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది .విజయనగర జిల్లాలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హంపి(Hampi)లో కన్నడ సాంస్కృతిక శాఖ.. ‘కర్ణాటక సంభ్రమం-50’ పేరుతో ఏడాది పొడవునా కన్నడ రాజ్యోత్సవాలను నిర్వహిస్తోంది.
ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య గురువారం.. కరుణాదయ జ్యోతి రథయాత్ర(Rath Yatra)ను ప్రారంభించారు.ఆ సమయంలో సిద్ధరామయ్య స్వగ్రామమైన సిద్ధరామనహుండికి చెందిన పలువురు కళాకారులు.. వీర మక్కల కుణిత జానపద నృత్యాన్ని ప్రదర్శించారు.కళాకారుల (Artists) కోరిక మేరకు సిద్ధరామయ్య కూడా వాళ్లతో నృత్యం చేశారు.జానపద పాటకు అనుగుణంగా కళాకారులతో కలిసి స్టెప్పులు వేసి సిద్ధరామయ్య అలరించారు. గాలిలో చేతులు కదుపుతూ డ్యాన్స్ వేశారు. కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు, కార్యకర్తలు, నాయకులు.. సిద్ధరామయ్య డ్యాన్స్ వేస్తుండగా చప్పట్లతో హోరెత్తించారు. ఈలలు వేస్తూ ఆయనను ఉత్సాహపరించారు.