»Pension Will Also Be Given To Those Who Do New Beedis Kcr
Beedi Pension: కొత్తగా బీడీలు చేసేవారికి కూడా పెన్షన్, కోరుట్ల సభలో కేసీఆర్
గత పదేళ్లలో ఏ అభివృద్ధి పనులు జరిగాయో చూడాలని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. నిర్మల్, ఆర్మూర్, కోరుట్ల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
Pension Will Also Be Given To Those Who Do New Beedis: KCR
CM KCR: కొత్తగా బీడీలు చేసేవారికి కూడా పెన్షన్ ఇస్తామని సీఎం కేసీఆర్ (CM KCR) హామీనిచ్చారు. కోరుట్ల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. మెట్ పల్లి, కోరుట్లలో పీజీ కాలేజీ ఏర్పాటు చేయాలని అభ్యర్థి సంజయ్ కోరారు. సంజయ్ ఎమ్మెల్యే కాక ముందే అవీ చేయు అని కోరుతున్నారని కేసీఆర్ (CM KCR) అన్నారు. సంజయ్.. చదువుకున్న వాడు, డాక్టర్ అని చెప్పారు. కోట్లు సంపాదించుకోగలడు.. కానీ ప్రజా సేవ చేసేందుకు వచ్చాడని, ఆశీర్వదించాలని కోరారు. మెట్ పల్లి, కోరుట్లతో తనకు ఉద్యమ సమయం నుంచి అనుబంధం ఉందన్నారు.
గత పదేళ్లలో ఏ అభివృద్ధి పనులు జరిగాయో చూడాలని కోరారు. చెప్పినవే కాకుండా.. చెప్పని సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చాం.. కల్యాణ లక్ష్మీ, రైతుబంధు ఎన్నికల ముందు ఇవ్వలేదని గుర్తుచేశారు. చేనేత కార్మికుల బడ్జెట్ పెంచుతామని స్పష్టంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో భూదాన్ పోచంపల్లిలో ఏడుగురు కార్మికులు చనిపోతే కనీసం రూ.50 వేలు కూడా ఇవ్వలేదన్నారు. అప్పటి ముఖ్యమంత్రిని స్వయంగా వెళ్లి అడిగితే ఇవ్వలేదని చెప్పారు.
బండ లింగపూర్ను మండలం కావాలని అడిగితే వెంటనే చేశామని గుర్తుచేశారు. 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చే ప్రభుత్వం తమదేనని తెలిపారు. వ్యవసాయాన్ని స్థిరికరించామని గుర్తుచేశారు. కరెంట్‌కు టాక్స్ లేదు. నీటికి ట్యాక్స్ లేదన్నారు. వ్యవసాయం పండగలా జరుగుతుందన్నారు. కాంగ్రెస్ నేతలు ధరణి రద్దు చేస్తామని అంటున్నారు. ధరణి తీసివేస్తే దళారుల రాజ్యమేలుతుందని చెప్పారు. ఫైరవీ కారులు మళ్లీ వస్తారని.. ఈ విషయంపై గ్రామంలో చర్చ పెట్టాలని కోరారు. ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ కూడా చెబుతున్నారని.. మరొకరు రైతుబంధు బేకర్ అంటున్నారని గుర్తుచేశారు.
అంతకుముందు ఆర్మూర్ సభ వేదికపై కేసీఆర్ మాట్లాడారు. అంకాపూర్ అంటే తనకు ప్రాణం అని చెప్పారు. అంకాపూర్ చికెన్ గురించి తాను చెప్పినంతగా ఎవరూ చెప్పలేదన్నారు. ఉదయం నిర్మల్‌లో కూడా పాల్గొన్నారు. ఈ మూడు చోట్ల బీడీ కార్మికుల సమస్య గురించి విన్నవించారు.