Anand Mahindra On Video Of Garbage Dumping Near Gateway Of India
Anand Mahindra: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఏ అంశమైనా సరే స్పందిస్తారు. తాను పోస్టులు చేస్తారు.. లేదంటే యూజర్ల పోస్టులను రీ ట్వీట్, లేదా కామెంట్ చేస్తుంటారు. ఒకతను షేర్ చేసిన వీడియోపై ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఆగ్రహాం వ్యక్తం చేశారు. ముంబైలో పరిశుభ్రత పాటించే అంశంపై నిర్లక్ష్యంగా ఉంటున్నారని మండిపడ్డారు.
గేట్ వే ఆఫ్ ఇండియా ముందు ఓ వ్యాన్‌లో నలుగురు వచ్చారు. గన్నీ బ్యాగ్‌లో చెత్త, కాగితాలను తీసుకొచ్చారు. రెండు బ్యాగులు తీసుకు రాగా.. ఒకతను వీడియో తీశారు. మెల్లిగా అటు, ఇటు చూసి ఆ చెత్తను అరేబియా సముద్రంలో పడవేశారు. ఒకటి తర్వాత మరొకటి వేసేశారు. ఆ వ్యక్తుల తీరుపై వీడియో తీసే అతను కూడా ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆ వీడియోను ఒకతను షేర్ చేయగా.. ఆనంద్ మహీంద్రా చూశారు. ఆ క్లిప్ చూసి ఆగ్రహాం వ్యక్తం చేశారు.
దక్షిణ ముంబైలో ఓ చారిత్రక ప్రదేశం వద్ద ఇలా చేయడం సరికాదన్నారు. ఆ వీడియో చూస్తుంటే చాలా బాధగా ఉంది. జనం తీరు మార్చకుంటే నగర జీవన శైలిలో ఎలాంటి మార్పు రాదన్నారు. ఆ వీడియోను గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, ముంబై పోలీసులకు ట్యాగ్ చేశారు. ఆ వీడియోను పరిశీలించిన బీఎంసీ, ముంబై పోలీసులు.. చెత్త వేసిన వ్యక్తిని పట్టుకునే పనిలో నిమగ్నం అయ్యారు. అతను వచ్చిన కారు ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించారు. బహిరంగ ప్రదేశంలో చెత్త పడేసినందుకు రూ.10 వేల జరిమానా విధించారు.
వీడియోకు నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. సిటీ యొక్క ఆత్మ దాని నిర్మాణాలలో మాత్రమే కాదు.. ప్రజల ఆలోచనా విధానంలో ఉండాలని ఒకరు.. కొందరు ఇంకా ఎప్పుడు మారతారని మరొకరు రాశారు. సిటీ క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇంకొకరు రాశారు.