nara lokesh:రోమ్ నీరో చక్రవర్తి మీకన్నా బెటర్, విశాఖ ఇన్సిడెంట్‌పై లోకేశ్
nara lokesh:సీఎం జగన్‌పై (cm jagan) టీడీపీ యువనేత నారా లోకేశ్ ఫైరయ్యారు. చిన్నారి మృతదేహాన్ని 120 కిలోమీటర్లు (120 km) బైక్ మీద పేరంట్స్ తరలించారు. ఈ ఘటన వీడియోను లోకేశ్ (lokesh) ట్వీట్ చేశారు. జగన్ సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. రోమ్ చక్రవర్తి నీరో మీకంటే బెటర్ అంటూ మండిపడ్డారు. పబ్జీ ప్లేయర్ గారూ! అంటూ ట్వీట్లు వేశారు.
nara lokesh:సీఎం జగన్‌పై (cm jagan) టీడీపీ యువనేత నారా లోకేశ్ ఫైరయ్యారు. చిన్నారి మృతదేహాన్ని 120 కిలోమీటర్లు (120 km) బైక్ మీద పేరంట్స్ తరలించారు. ఈ ఘటన వీడియోను లోకేశ్ (lokesh) ట్వీట్ చేశారు. జగన్ సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. రోమ్ చక్రవర్తి నీరో మీకంటే బెటర్ అంటూ మండిపడ్డారు. పబ్జీ ప్లేయర్ గారూ! అంటూ ట్వీట్లు వేశారు. ఆ వీడియో చూసి.. పేరంట్స్ కష్టం తెలిసి మాకే కన్నీళ్లు వస్తున్నాయని పేర్కొన్నారు. కానీ కరకు గుండె మాత్రం కరగదు అని లోకేశ్ (lokesh) అన్నారు. మృతదేహాం తరలింపు కోసం అంబులెన్స్ ఎందుకు ఏర్పాటు చేయలేదు అని అడిగారు.
ఇలాంటి ఘటన రోజుకోకటి వెలుగుచూస్తుందని లోకేశ్ (lokesh) మండిపడ్డారు. పూటకో దయనీయ దృశ్యం బయటపడుతుందని చెప్పారు. మీ దరిద్ర పాలన అంటూ జగన్‌పై (jagan) ఓ రేంజ్లో ఫైరయ్యారు. వైద్యం కోసం వెళితే నిర్లక్ష్యం.. చనిపోయిన వారిని తరలించేందుకు అంబులెన్స్ (ambulance) రావు.. పేదలు చనిపోతే అనాథ శవాల్లా పడి ఉండటమేనా అని అడిగారు. దయ, జాలి, కరుణ లేకుండా ఎందుకు ఉంటున్నారని మండిపడ్డారు.
రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్న నీరో మీకంటే బెటర్ పబ్జీ ప్లేయర్ గారూ! పసిగుడ్డు మృతదేహాన్ని విశాఖ నుంచి 120 కిలోమీటర్లు బైకుపై పాడేరు తీసుకెళ్లిన ఆ తల్లిదండ్రుల కష్టం విన్న మాకే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మీ కరకు గుండె మాత్రం కరగదు.(1/2) pic.twitter.com/A8JDFRrAo3
చిన్నారి చికిత్స కోసం అల్లూరి (alluri) జిల్లాకు చెందిన దంపతులు విశాఖపట్టణంలో గల కేజీహెచ్ (kgh) ఆసుపత్రికి వచ్చారు. అయితే చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతి చెందింది. స్వగ్రామానికి వెళ్లేందుకు అంబులెన్స్ (ambulance) ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు ప్రాధేయపడ్డారు. అంబులెన్స్ నిరాకరించడంతో చిన్నారి మృతదేహంతో బైక్‌పై 120 కిమీ ప్రయాణించాల్సి వచ్చింది. దానిని వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. నేతలు స్పందిస్తున్నారు. జగన్ సర్కార్ తీరు గురించి మండిపడుతున్నారు.
రోజుకో అమానవీయ ఘటన, పూటకో దయనీయ దృశ్యం మీ దరిద్రపాలనలో సర్వసాధారణమైపోయాయి. వైద్యానికి వెళితే నిర్లక్ష్యం. చనిపోయిన వారిని తరలించేందుకు అంబులెన్సులు రావు. నిరుపేదలు చనిపోతే అనాథ శవాల్లా పడి వుండడమేనా?(2/2)#IdhemKarmaManaRashtraniki
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (pawan kalyan) కూడా ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన బిడ్డను తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వని ప్రభుత్వం ఇది అని విమర్శించారు. బిడ్డ మృతదేహంతో 120 కిమీ బైకుపై వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఆ గిరిజన దంపతులకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
ఇలాంటి ఘటన దేశంలో రోజుకో చోట జరుగుతూనే ఉంది. ఎన్ని వార్త కథనాలు వచ్చినా.. ప్రభుత్వాల్లో మాత్రం స్పందన రావడం లేదు. అందుకే మరికొందరు ఆ జాబితాలో చేరుతున్నారు.