Viral Video : ఉమ్మి వేస్తూ రోటీలు తయారీ..కస్టమర్లు షాక్
ఓ హోటల్ లో పని చేసే వ్యక్తి కస్టమర్లు తినే ఆహారంలో ఉమ్మి వేశాడు. ఉమ్మి వేస్తూ ఆ వ్యక్తి రోటీలు తయారు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతున్నాయి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని బాగ్ పత్ జిల్లా రతౌల్ పట్టణంలో చోటుచేసుకుంది.
చాలా మందికి ఇంట్లో చేసే వంటలకన్నా బయట హోటల్(Hotels)లో చేసే వంటకాలంటే చాలా ఇష్టం. ఇంకొందరైతే దాబాల చుట్టూ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల(Fast food centres) చుట్టూ తిరుగుతూ అనేక వంటలను రుచి చూస్తుంటారు. అటువంటి వారు కాస్త అలర్ట్ గా ఉండటం మంచిది. తాజాగా ఓ హోటల్ లో పని చేసే వ్యక్తి కస్టమర్లు తినే ఆహారంలో ఉమ్మి వేశాడు. ఉమ్మి వేస్తూ ఆ వ్యక్తి రోటీలు తయారు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతున్నాయి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని బాగ్ పత్ జిల్లా రతౌల్ పట్టణంలో చోటుచేసుకుంది.
ఉమ్ముతూ రోటీలు చేస్తున్న వీడియో:
అలీ రహ్మత్ హోటల్ లో రోటీలు(Roties) చేసే వ్యక్తి చాలా హుషారుగా వేగంగా తయారు చేస్తున్నాడు. రోటీలు చేస్తూ మధ్య మధ్యలో ఆ వ్యక్తి పిండిపై ఉమ్మేస్తున్నాడు. ఆ తర్వాత రొట్టెలు కాలుస్తూ వాటిని కస్టమర్లకు సర్వ్ చేస్తున్నాడు. విషయం తెలియక అక్కడికి వచ్చిన కస్టమర్లు(Customers) ఆ రోటీలను అలానే తింటూ ఉన్నారు.
రోటీలు(Roties) చేసే సమయంలో ఓ వ్యక్తి ఆ తతంగాన్ని అంతా వీడియో(Video) తీశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్(Video Viral) అవుతోంది. బాగ్ పత్ లోని ఖేక్రా పోలీస్ స్టేషన్ లోని రతౌల్ లో ఈ దారుణ ఘటన జరిగింది. ఉమ్ముతూ రోటీలు తయారు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారు. నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.