NZB: నందిపేట మండలం ఖుద్వాన్పూర్లోని ఎస్సీ, బీసీ వసతి గృహాలతో పాటు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వసతి గృహాల్లోని సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో అపరిశుభ్రతగా ఉండటంతో సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.