SRD: నాగలిగిద్ద మండలం ఇరాక్పల్లి తండా సమీపంలో హోటల్ నిర్వహిస్తున్న యువకుడు చక్కెర కొనుగోలుకు వెళ్లి అదృశ్యమైనట్లు ఎస్సై సాయిలు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం ఔరత్ తాలూకా కోర్రేకల్ ఘామా తండాకు చెందిన పవర్ ప్రకాష్ (35) రెండేళ్లుగా హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. 10న చక్కెర కొనుగోలుకు ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైనట్లు తెలిపారు.