HYD: కూకట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ (భరత్‌నగర్) నూతన ఛైర్మన్ కొండకింది పుష్పారెడ్డి, వైస్ ఛైర్మన్ ప్రకాష్ ముదిరాజ్, డైరెక్టర్లు శుక్రవారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ కూకట్పల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ బండి రమేష్, టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ సత్యం శ్రీరంగం ముఖ్య అతిథులుగా హాజరై నూతన కమిటీని అభినందించారు.