హైదరాబాద్ (Hyderabad)లోని పంజాగుట్ట స్మశానవాటిక వద్ద ఓ యువతి హల్ చల్ చేసింది. అర్థరాత్రి (Midnight) అక్కడకు వచ్చి నానా హంగామా చేసింది. అర్థరాత్రి 12 దాటిన తర్వాత అక్కడకు వచ్చిన ఆమె దాదాపు 2 గంటలపాటు నానా రచ్చ చేసింది. ఆమెను తన లవర్ అక్కడ వదిలిపెట్టి వెళ్లాడంట. అంతే, అక్కడ కూర్చొని ఏడుస్తూ, నానా గగ్గోలు పెట్టడం మొదలుపెట్టింది. ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించడం కూడా మొదలుపెట్టాడు. అయితే, దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు (Punjagutta) సమాచారం అందించడంతో వారు వచ్చి ఆమెను స్టేషన్ కి తీసుకువెళ్లారు.
ఆమె వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. పబ్లిక్‌లో న్యూసెన్స్ చేయడంపై యువతికి పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఆమె వివరాలు తెలుసుకున్న తర్వాత కుటుంబసభ్యులు, బంధువులకు అప్పగించనున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రేమించినవాడు వదిలేయడంతో ఆమె అలా చేసిందని తెలియడం గమనార్హం.