తెలంగాణ (Telangana)కు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసింది. మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Weather Department) వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భీకర గాలులు వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపింది. శనివారం నుంచి బుధవారం వరకు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
సెప్టెంబర్ నెలలో సాధారణ వర్షపాతానికి మించి రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైందని, ఈ నెలలో సాధారణ వర్షపాతం 77.3 మి.మీ ఉండగా శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 150.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. ఇప్పటి వరకూ 95 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింటెక్స్ కంపెనీ రాష్ట్రంలో రూ.350 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా మరో 1000 మందికి ఉద్యోగాలు రానున్నాయి.