Working while running the scooty due to software problems
Viral News: సాఫ్ట్వేర్ జాబ్ (software job) అనగానే లగ్జరీ జీతాలు, లావిష్ లైఫ్ గుర్తుకు వస్తాయి. వారానికి 5 రోజులు పనిచేస్తారు. నెలఖారున లక్షలు సంపాదిస్తారు. వీకెండ్ పబ్‌లు, మంతెండ్ పార్టీలు, ప్రాజెక్ట్ ఓకే అయితే వెకేషన్లు, బోనస్ అని సాధారణంగా అందరూ అనుకుంటారు. వారికి పనిభారంతోపాటు విపరీతమైన మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. ఈ ఫీల్డ్‌లో ఉన్నవారికి విషయం తెలుసు. హైదరాబాద్(Hyderabad)లో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకతను స్కూటీపై వెళుతూ కాళ్ల మధ్యలో ల్యాప్ ట్యాప్ (Lap tap) పెట్టుకొని మధ్య మధ్యలో ఆగుతూ పని చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ వీడియో వైరల్ అవడంతో నెటిజన్లు అయ్యో పాపం అని కామెంట్లు పెడుతుండగా.. సదరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మా కష్టాలు ఎవరికి చెప్పలేనివి. మా బాధ ఇలా ఉంటాయి అని అంటున్నారు.
ఐటీ ఫీల్డ్ (IT field) అంటేనే పోటీ ప్రపంచం. ఇక్కడ కాలంతోపాటు కాదు సాఫ్ట్ వేర్‌తో అప్డేట్ అవుతూ ఉండాలి.. లేదంటే వెనకబడి పోవడం ఖాయం. ఏదైన తేడాలొస్తే చాలా మంది తమ స్థానంలో ఉద్యోగం చేయడానికి సిద్దంగా ఉంటారు. పలు కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తుంది. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) రావడంతో చాలా మంది డెవలపర్లకు ఆందోళన పట్టుకుంది. ఇలా ప్రతి క్షణం వారు ఒత్తిడితో పనిచేయాల్సి ఉంటుంది. అందుకే లక్షల్లో జీతాలు వస్తున్నా చాలా మంది మనశ్సాంతిగా ఉండడం లేదు.