»Will Join National Party Ponguletis Sensational Comments
Ponguleti : జాతీయ పార్టీలోనే చేరుతా… పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
ఏదైనా జాతీయ పార్టీలోనే చేరుతాని ఈ నెలాఖరులోగా ఆ పార్టీ ఏదో వెల్లడిస్తానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు.శనివారం రోజు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలో పొంగులేటి క్యాంపు ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ (CM KCR) మాయమాటలు నమ్మి తెలంగాణ ప్రజలు రెండుసార్లు మోసపోయారని అన్నారు.
ఏదైనా జాతీయ పార్టీలోనే చేరుతాని ఈ నెలాఖరులోగా ఆ పార్టీ ఏదో వెల్లడిస్తానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు.శనివారం రోజు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలో పొంగులేటి క్యాంపు ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ (CM KCR) మాయమాటలు నమ్మి తెలంగాణ ప్రజలు రెండుసార్లు మోసపోయారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం(Telangana separate state) ఏర్పడితే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయనుని అంతా అనుకుంటే.. కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే న్యాయం జరిగిందన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల రూపాయల నష్ట పరిహారం అందిస్తామని చెప్పి ఇప్పటికీ అందించలేకపోయారని ఫైర్ అయ్యారు.
రైతుల రుణమాఫీ(Loan waiver) అమలు ఊసే లేకుండా పోయిందన్నారు. ఈసారి కేసీఆర్ మాయ మాటలు చెప్తే నమ్మొద్దన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా గెలిచారు. ఆయన వైఎస్ జగన్(YS Jagan) కు అత్యంత సన్నిహితులు. వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా గెలిచినప్పటికీ ఆ తర్వాత బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరారు. కానీ గత ఎన్నికల్లో ఆయనకు పోటీ చేయడానికి టిక్కెట్ లభించలేదు. అయినప్పటికీ బీఆర్ఎస్ లోనే కొనసాగారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకు టిక్కెట్ లబించే అవకాశాలు లేవని భావించడంతో ఇటీవల ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఏ పార్టీలో చేరాలన్న దానిపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయన బీజేపీ (BJP) పెద్దలతో సమావేశం అయ్యారని గతంలో ప్రచారం జరగింది.
కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆయనకు ఆహ్వానం పంపారని చెబుతున్నారు. అయితే పొంగులేటి మాత్రం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల(Sharmila)తో పాటు .. వైఎస్ విజయలక్ష్మి(YS Vijayalakshmi)తోనూ రెండు సార్లు సమావేశం అయ్యారు.అనుచరులు, ప్రజాభిప్రాయం ప్రకారమే పార్టీ మారే నిర్ణయం తీసుకుంటామన్నారు. అశ్వరావుపేట (Aswaraopeta) అభ్యర్థిగా జారే ఆదినారాయణను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. తాను ఏ పార్టీలో చేరినా తన అనుచరులకు టికెట్ ఇచ్చే ధైర్యం ఉంది కాబట్టే అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రులు అంటే ఎన్టీఆర్ (NTR) , వైఎస్ఆర్ లా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని సీఎం కేసీఆర్ కు సెటైర్లు వేశారు. దమ్ముంటే తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ చేశారు.ఆదివారం పొంగులేటితో భేటీ అయిన 20 మంది బీఆర్ఎస్ (BRS) నేతలను పార్టీ సస్పెండ్ చేసింది.