Vijayashanti And Bandi Sanjay: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం స్పీడందుకుంది. సీఎం కేసీఆర్ వరస బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బస్సు యాత్రలతో బిజీగా ఉన్నారు. జమ్మికుంటలో రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాతోపాటు బీ ఫామ్స్ కూడా ఇచ్చేసింది. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయ్యింది. బీజేపీ మొదటి జాబితా రేపు వచ్చే అవకాశం ఉంది. ఇంతలో విజయశాంతి (Vijayashanti) చేసిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
‘బీఆర్ఎస్పై రాజీలేని పోరాటం చేయడంలో బీజేపీ వెనక్కి తగ్గదని కార్యకర్తల విశ్వాసం.. గజ్వేల్ నుంచి బండి సంజయ్, కామారెడ్డి నుంచి తాను కేసీఆర్పై పోటీ చేయాలని మీడియాలో వార్తలు రావడంతో కార్యకర్తలు అడుగుతున్నారు.. అదీ తప్పుకాదు.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం తన ఉద్దేశం కాదు.. వ్యుహాత్మక నిర్ణయాలు పార్టీ నిర్దేషితం అని’ విజయశాంతి పోస్ట్ చేశారు. హర హర మహేదవేవ అంటూ ముగించారు.
కామారెడ్డి నుంచి రాములమ్మ
విజయశాంతి, బండి సంజయ్ ఇద్దరూ కేసీఆర్ మీద బరిలోకి దిగుతున్నారా..? కామారెడ్డి అసెంబ్లీకి బీజేపీ నుంచి రాములమ్మ.. గజ్వేల్ నుంచి బండి సంజయ్ పోటీ చేస్తారా..? అనే చర్చ జరుగుతోంది. కార్యకర్తలు కోరుతున్నారని చెప్పడం.. రేపు లిస్ట్ విడుదల అవడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీలో ఉన్న బలమైన నేతలను సీఎం కేసీఆర్పై బరిలోకి దింపాలని హై కమాండ్ అనుకుంటుందో చూడాలి.. మరి కొన్ని గంటల్లో ఫస్ట్ లిస్ట్ వచ్చేస్తోంది.. సో అప్పటివరకు ఏం జరుగుతుందో చూడాలి.
బీఆర్ఎస్ పై రాజీలేని పోరాటం చేయడంలో బీజేపీ వెనక్కు తగ్గదు.. అని కార్యకర్తల విశ్వాసం.
అందుకు, గజ్వేల్ నుండి బండి సంజయ్ గారు, కామారెడ్డి నుండి నేను అసెంబ్లీకి కేసీఆర్ గారిపై పోటీ చెయ్యాలని గత కొన్ని రోజుల మీడియా సమాచారం దృష్ట్యా, కార్యకర్తలు అడగటం తప్పు కాదు.
అసెంబ్లీకి పోటీ చేసేందుకు సుముఖంగా లేనని విజయశాంతి చెప్పుకొచ్చారు. అంటే లోక్ సభ బరిలో దిగుతారా..? అనే అనుమానం కలుగుతుంది. అలా పోటీ చేసి.. ఒక వేళ గెలిస్తే.. మోడీ ప్రభుత్వం మూడోసారి ఏర్పడితే.. కేంద్ర మంత్రి పదవీ కావాలని అనుకుని ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.