NZB: ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని BJP కిసాన్ మోర్చ రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కలిగోట్ గంగాధర్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో ఆదివారం నాడు వారు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే BJP ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.