మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 59 పిర్యాదులు అందినట్లు అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, రాధిక గుప్తా తెలిపారు. సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు సమస్యలను అర్జీల రూపంలో వారు స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులను వారు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సంభందిత అధికారులకు వారు ఆదేశించారు.