AP: మంత్రి నారా లోకేష్‌కు మద్దతుగా ఆయన సతీమణి నారా బ్రాహ్మణి మంగళగిరిలో ఎన్నికల ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రచారంలో కూరగాయలు అమ్ముకునేందుకు సరైన స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు బ్రాహ్మణికి తెలిపారు. ఆమె తన దృష్టికి వచ్చిన సమస్యను అధికారులకు చెప్పారు. తాజాగా సమస్య పరిష్కారానికి కూరగాయల వ్యాపారులకు స్థలాన్ని మున్సిపల్ అధికారులు కేటాయించారు. దీంతో బ్రాహ్మణికి వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు.