AP: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ప్రధాని మోదీని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా కోరారు. రాష్ట్రంలో దాడులు చూస్తుంటే బాధేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా బెల్ట్ షాపుల వల్లే అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. 120 రోజుల్లో 110కి పైగా దాడులు, అఘాయిత్యాలు జరిగాయని పేర్కొన్నారు. పోలీసుశాఖపై నేరస్తుల్లో భయం లేకుండా పోయిందని విమర్శించారు.