కృష్ణా: నూజివీడు పట్టణంలోని కోనేరు పేటలో గల అర్బన్ హెల్త్ క్లినిక్ సెంటర్ నందు నవజీవన్ బాల భవన్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు, సోషల్ మీడియా దుర్వినియోగంపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. బాల భవన్ ప్రోగ్రాం మేనేజర్ గొల్లమూడి శేఖర్ బాబు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగాన్ని నివారించడం, సోషల్ మీడియా దుర్వినియోగంతో అనర్ధాలను వివరించారు.