ప్రకాశం: పుల్లలచెరువులోని సహాయక ఇంజనీరు కార్యాలయంలో వై.పాలెం గృహ నిర్మాణ శాఖ DEE సురేశ్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 350 ఇల్లు పూర్తి కావాల్సి ఉందని, లబ్ధిదారులు తమ గృహాలను త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు. త్వరలో హౌసింగ్ పథకం 2.0 ద్వారా కొత్తగా ఇళ్ళు మంజూరు కానున్నాయన్నారు.