బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుక్ ఖాన్, టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. నవంబర్ 2న షారుక్ ఖాన్ పుట్టినరోజు సందర్బంగా గంభీర్ ‘ఎక్స్’ వేదికగా.. 25 ఏళ్లు వయసు నిండిన వ్యక్తి ఇదిగో అంటూ పోస్టు పెట్టాడు. దీనికి షారుక్ ఖాన్ తాజాగా స్పందిస్తూ.. ‘మీరిచ్చే స్పూర్థికి నా ధన్యవాదాలు. మీరు ఎప్పటికీ నా కెప్టెన్. లవ్ యూ..’ అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో వీరి పోస్టులు ప్రస్తుతం వైరల్గా మారాయి.