TG: ఆహారాన్ని కల్తీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని.. కఠిన చర్యలు తప్పవని మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. హాస్టళ్లలో విద్యార్థులకు మంచి భోజనం పెట్టకుండా ఇబ్బంది పెట్టేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పెరిగిన హోటళ్ల సంఖ్య, జనాభాకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల సంఖ్యను పెంచనున్నట్లు మంత్రి ప్రకటించారు.