దేశంలో కులవ్యవస్థ, కులవివక్ష ఉందని ఒప్పుకుందాం.. తాను దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నానని ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దేశం గురించి నిజం చెబితే దేశాన్ని విభజించడమా..? కులగణన ద్వారా దళితులు, ఓబీసీలు, మహిళల సంఖ్యపై స్పష్టత వస్తుందన్నారు. కులగణన తర్వాత ఎవరి దగ్గర ఎంత ఆర్థిక వనరులున్నాయో తెలుసుకుందామన్నారు. కులగణన చేస్తామని పార్లమెంట్లో స్పష్టంగా చెప్పినట్లు గుర్తు చేశారు.