జార్ఖండ్‌లోని ఇండియా కూటమి దీపావళి చిచ్చుబుడ్డి లాంటిదని..శక్తివంతమైన రాకెట్ లాంటి BJP ఎదుట నిలవలేక తుస్‌మనడం ఖాయమని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. BJP గెలిస్తే జార్ఖండ్ రాష్ట్రం అభివృద్ధి ప్రయాణంలో కొత్త మైలురాళ్లను చేరడం ఖాయమన్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న జార్ఖండ్ ముక్తి మోర్చా తన పేరును ‘జమ్ కర్ మలాయీ మారో’ (కూడబలుక్కొని మీగడ చిలకండి) అని మార్చుకుంటే బెటర్ అని ఆయన సూచించారు.