అమెరికాలో పోలింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ సమయంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందన్న అంచనాతో నేషనల్ గార్డ్స్ రంగంలోకి దిగాయి. అమెరికా నిఘా సంస్థల హెచ్చరికలతో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వాషింగ్టన్ డీసీ సహా 18 రాష్ట్రాల్లో జాతీయ బలగాలు మోహరించాయి. నేషనల్ గార్డ్స్‌లో సైబర్ నిపుణులు, పౌర సేవల బృందాలు ఉన్నాయి. 2020 ఎన్నికల సమయంలో ఘటనలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.