NZB: ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. చైర్మన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, కమిషనర్ రాజులు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చాకలి ఐలమ్మ మహిళలందరికీ స్ఫూర్తిదాయకమని వారు కొనియాడారు. ఆమె పోరాట తెగువ అందరికీ ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు.