TSRTC Good News For Rama Devotes : రామయ్య భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్…!
Good News : భద్రాద్రి రామయ్య భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త తెలియజేసింది. మరి కొద్ది రోజుల్లో శ్రీరామ నవమి రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
భద్రాద్రి రామయ్య భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త తెలియజేసింది. మరి కొద్ది రోజుల్లో శ్రీరామ నవమి రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేరవేసేందుకు సన్నద్దమవుతోంది. తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ కార్గో పార్శిల్ కేంద్రాల్లో రూ.116 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్ఆర్టీసీ హోం డెలివరీ చేయనుంది.
హైదరాబాద్ లోని బస్ భవన్ లో బుధవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు. అనంతరం బిజినెస్ హెడ్ (లాజిస్టిక్స్) పి.సంతోష్ కుమార్‌కు రూ.116 చెల్లించి రశీదును ఆయన స్వీకరించారు. తొలి బుకింగ్ చేసుకుని తలంబ్రాల బుకింగ్‌ను ప్రారంభించారు.