»Tspsc Paper Leak Minister Indrakaran Reddy Shocking Comments
TSPSC Paper Leak: పేపర్ లీకేజీపై ఇంద్రకరణ్ షాకింగ్ కామెంట్స్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. పేపర్ లీకేజీ (Paper Leak) సర్వ సాధారణంగా జరిగేవే అంటూ దీనిని తేలిగ్గా కొట్టి పారేసే ప్రయత్నం చేశారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. పేపర్ లీకేజీ (Paper Leak) సర్వ సాధారణంగా జరిగేవే అంటూ దీనిని తేలిగ్గా కొట్టి పారేసే ప్రయత్నం చేశారు. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయన్నారు. గతంలో పదో తరగతి (Tenth Class), ఇంటర్ పేపర్లు లీక్ (Inter Paper Leak) అయ్యాయని గుర్తు చేశారు. పేపర్ లీకేజీలో మంత్రి కేటీ రామారావు (Minister KT Rama Rao) దోషి అని చెప్పడాన్ని ఆయన ఖండించారు. ఇలాంటి మాటలు సరికాదన్నారు. కేసీఆర్ కు నోటీసులు (Notices to BRS leader) ఇవ్వాలని చెప్పడంలో అర్థం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ (Telangana Congress) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Telangana Congress chief Revanth Reddy) లీకేజీ వ్యవహారంలో ఆరోపణలు చేయడం కాదని, ఇందుకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పీఏ గ్రామంలో అధిక మార్కులు వచ్చిన వారి జాబితా సమర్పించాలని హితవు పలికారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Telangana BJP chief Bandi Sanjay) నోటికి అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు.
ఇదిలా ఉండగా, ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులను నాలుగో రోజు విచారించారు. నేటి దర్యాఫ్తులో పలు కీలక ఆధారాలను సిట్ అధికారులు సేకరించినట్లుగా తెలుస్తోంది. పరీక్ష రాసిన గోపాల్, నీలేష్ కు, నీలేష్ సోదరుడు రాజేంద్ర నాయక్ డబ్బులు సమకూర్చినట్లుగా గుర్తించారు. మేడ్చల్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న శ్రీనివాస్ ద్వారా మరికొంత నగదు ఇప్పించినట్లుగా తెలుస్తోంది. బడంగ్ పేటలోని ప్రవీణ్ ఇంట్లో సిట్ అధికారులు నిన్న సోదాలు నిర్వహించారు. మణికొండలోని రాజశేఖర రెడ్డి ఇంట్లో సోదాల సమయంలో మరికొన్ని ప్రశ్నాపత్రాలను సిట్ స్వాధీనం చేసుకున్నది. మార్చి 5న నీలేష్, గోపాల్ అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష రాశారు. పేపర్ ఇచ్చినందుకు వీరిద్దరు కానిస్టేబుల్ శ్రీనివాస్ ద్వారా రూ.14 లక్షలు సమకూర్చినట్లు సిట్ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. నిందితురాలు రేణుకతో పాటు ఆరుగురిని హిమయత్ నగర్ లోని సిట్ ఆఫీస్ కు తీసుకు వచ్చి విచారించారు.