బీజేపీ(BJP) అంటే బ్రిటీష్ జనతా పార్టీని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఆరోపించారు. నాడు బ్రిటీష్ విభజించు... పాలించు విధానాన్ని బీజేపీ (BJP) అమలు చేస్తుందన్నారు. మతాలు, ప్రాంతాలు, కులాలు, భాషల మధ్య బీజేపీ చిచ్చుపెడుతుందని ఆయన విమర్మించారు. రాహుల్ గాంధీ (Rahul Gandi) పై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్(Congress) పార్టీ చేపట్టిన ‘సంకల్ప్ సత్యాగ్రహ’లో రేవంత్ పాల్గొన్నారు.
బీజేపీ(BJP) అంటే బ్రిటీష్ జనతా పార్టీని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఆరోపించారు. నాడు బ్రిటీష్ విభజించు… పాలించు విధానాన్ని బీజేపీ (BJP) అమలు చేస్తుందన్నారు. మతాలు, ప్రాంతాలు, కులాలు, భాషల మధ్య బీజేపీ చిచ్చుపెడుతుందని ఆయన విమర్మించారు. రాహుల్ గాంధీ (Rahul Gandi) పై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్(Congress) పార్టీ చేపట్టిన ‘సంకల్ప్ సత్యాగ్రహ’లో రేవంత్ పాల్గొన్నారు. వ్యాపార ముసుగులో బ్రిటీషర్స్ దేశంలో అడుగుపెట్టింది గుజరాత్‌లోని సూరత్‌లోనే అన్నారు. బ్రిటీష్ దొరలను దేశం నుండి తరిమికొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. గాంధీ, నెహ్రు, పటేల్ దేశ నిర్మాణానికి పునాదులు వేశారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పునాదులతోనే ఈనదియా ప్రపంచంలోనే గుర్తింపు పొందిందనన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) లేకుంటే హైదరాబాద్ కి స్వతంత్రం వచ్చేది కాదని అమిత్ షా అంటున్నాడని.. వల్లభాయ్ పటేల్ కి మీ పార్టీకి సంబంధం ఏమిటని రేవంత్ రెడ్డి అన్నారు.
రాహుల్ గాంధీ మాట్లాడింది కర్ణాటకలో(Karnataka) అయితే గుజరాత్ లో కేసు ఎలా వేస్తారన్నారు. గాంధీ భవన్ నిర్మాణానికి పునాదులు వేసింది సర్దార్ పటేల్ అని గుర్తుచేశారు. నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటీషర్స్ సహజ వనరులను కొల్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు బ్రిటిష్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సూరత్(Surat)నుండి అదానీ కంపెనీ బయలుదేరిందన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, దేశ సహజ వనరులను బ్రిటీష్ జనతా పార్టీ అదానీకి కట్టబెడుతుందని ఆయన ఆరోపించారు. అదాని కంపెనీలో (Adani company) 23 వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది ఎవరో తేలాలన్నారు. అదానీ దొంగతనం చేశారంటే ప్రధాని మోదీ (PM Modi) ఎందుకు భయపడుతున్నాడని నిలదీశారు రేవంత్ రెడ్డి. అదానిపై ఈడి విచారణ జరగాలంటే మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.