KCR Bhima- Prati Intiki Dhima kcr announce New Scheme
BRS manifesto: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కదనరంగంలో సీఎం కేసీఆర్ (cm kcr) దిగబోతున్నారు. రేపటి నుంచి బిజీ అవుతారు. మధ్యాహ్నాం 12.15 గంటలకు తెలంగాణ భవన్లో మేనిఫెస్టో ప్రకటిస్తారు. ఆ తర్వాత అభ్యర్థులకు బీ ఫామ్స్ ఇస్తారు. అక్కడినుంచి హుస్నాబాద్ వెళ్లి ప్రచార పర్వానికి సమరశంఖం పూరిస్తారు. ఇక వరసగా సభలు, సమావేశాలతో బిజీగా ఉంటారు.
మేనిఫెస్టోలో (manifesto) నాలుగైదు వర్గాలకు పూర్తిస్థాయిలో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మధ్య తరగతి వారి కోసం కొత్త పథకం అమలు చేస్తారు. సామాజిక భద్రత కింద ఇస్తోన్న పెన్షన్లను పెంచుతారు. రైతుబంధు నగదు కూడా పెంచుతారని తెలిసింది. గృహిణులకు ఊరట కలిగించే హామీలు ఉంటాయి.
దళిత, బీసీ, మైనార్టీ బంధు పథకాలు ఎక్కువ మందికి అందేలా కార్యాచరణ రూపొందించారు. యువత కోసం కొన్ని హామీలు ఇచ్చే అవకాశం ఉంది. పాత హామీలను కొనసాగిస్తూ.. లబ్ధిదారుల సంఖ్యను పెంచే ఛాన్స్ ఉంది. సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడమే తమ లక్ష్యం అని కేసీఆర్ అంటుంటారు.. ఆ మేరకు అన్నీ వర్గాలకు పథకాలు ఉండే అవకాశం ఉంది.