బిజేపీ విధానాలు సరిగా లేవని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు. తమ తెలంగాణ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో సఫలం, సంక్షేమం, సామరస్యం సాధించగా…. ఇదే కాలంలో బీజేపీ విఫం, విషం, విద్వేషాలను పెంచుకుందని ఆయన పేర్కొన్నారు. విషం, విద్వేషాన్నిన బీజేపీ తన విధానాలుగా మార్చుకుందని ఆయన దుయ్యబట్టారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన హరీష్ రావు.. బిజేపీ పై తీవ్ర విమర్శలు చేయడం గమనార్హం.
అన్ని రాష్ట్రాలు కలిపితేనే దేశం అని.. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్పూర్తిని ఏమాత్రం గౌరవించడం లేదని ఆరోపించారు.బలమైన కేంద్రం బహీనమైన రాష్ట్రాలే.. బీజేపీ ప్రభుత్వం మౌలిక సిద్ధాంతమని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్రాలు ఆధారపడాలని.. బీజేపీ భావిస్తోందని ఫైర్ అయ్యారు. రాష్ట్రాలు ఆర్థికంగా ఎదగకుండా.. కేంద్రం మోకాలడ్డుతోందని ఆరోపించారు.
రైతు వ్యతిరేక చట్టాలు, విద్యుత్ సంస్కరణల వంటి ఏకపక్షమైన నిర్ణయాలు తీసుకుంటూ.. రాష్ట్రాలను బలహీనం చేస్తున్నారని విమర్శించారు. ఆఖరికి ఐఏఎస్ అధికారులను కూడా.. రాష్ట్రాలతో సంబంధం లేకుండా బదిలీలు చేసేలా నిర్ణయాలు తీసుకోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.