తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ (Free electricity) పై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం మొదలైంది.వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్నామంటూ ప్రభుత్వం ఇన్నాళ్లుగా చెబుతూ వస్తున్నది నిజం కాదా? అవసరమైన చోట్ల, అవసరం మేరకు మాత్రమే విద్యుత్తు సరఫరా జరుగుతోందా? అంటే.. ఇటు అధికార యంత్రాంగం, మరోవైపు అధికార పార్టీ చేస్తున్న ప్రకటనలు ఇది నిజమేనని నిర్ధారిస్తున్నాయి.సబ్స్టేషన్ల (substations) వద్ద ఉండే కీలకమైన లాగ్బుక్కులే కేంద్రంగా ప్రతిపక్ష కాంగ్రెస్ చేసిన సవాలు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టినట్లే తెలుస్తోంది.
వాస్తవానికి రెండేళ్లుగా వ్యవసాయ (Agricultural) రంగానికి త్రీఫేజ్ కరెంట్ సరఫరాపై డిస్కమ్‌లు నియంత్రణ విధిస్తున్న విషయం విదితమే. పలు చోట్ల 9 నుంచి 12 గంటలే వ్యవసాయానికి త్రీఫేజ్ కరెంట్ (Three phase current) ఇస్తున్నారు. అయితే త్రీఫేజ్ కరెంట్ సరఫరాపై నియంత్రణ కొనసాగుతుండగా, ‘మూడు గంటల కరెంట్ ఇచ్చే సర్కారు వద్దు’ అనే నినాదంతో అధికార పక్షం ప్రతిపక్ష కాంగ్రె్‌సను టార్గెట్ చేస్తూ ఉద్యమిస్తోంది. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టే క్రమంలో విపక్ష కాంగ్రె్‌సకు లాగ్‌బుక్ (Logbook)అనే బలమైన ఆయుధం లభించినట్లయింది. క్షేత్రస్థాయిలో సబ్స్టేషన్ల (substations) నుంచే అన్నిరంగాలకు కరెంట్ సరఫరా అవుతోంది