»Telangana Good News For The Beneficiaries Of Arogyashri Minister Harish Raos Key Announcement
Telangana: ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు గుడ్ న్యూస్..మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన
తెలంగాణ సర్కార్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్య శ్రీలో వైద్య సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. అలాగే ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను కూడా పేదలకు ఇవ్వనుంది.
ఆరోగ్యశ్రీ(ARogya sri) సేవలు పొందేవారికి తెలంగాణ(Telangana) సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన పేదలకు మంచి వైద్యం అందించాలనే కాన్సెప్ట్‌తో ఆరోగ్య శ్రీ సేవలు ప్రజలకు దగ్గరయ్యాయి. ఈ పథకం వల్ల ఎంతో మంది పేదలకు మంచి వైద్యం అందింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ పథకంపై కేసీఆర్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. పేదలకు సౌకర్యంగా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఆరోగ్య శ్రీ పథకం ద్వారా లబ్దిపొందే వారి కోసం వైద్య సేవల పరిమితిని 2 లక్షల నుండి 5 లక్షలకు తెలంగాణ సర్కార్ పెంచింది.
సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు… కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందించి, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం. pic.twitter.com/3dUUrSSzPv
దానికి సంబంధించిన ఉత్తర్వులను అధికారులకు సర్కార్ జారీ చేసింది. ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు(Health minister Harish Rao) దీనిపై ప్రత్యేకంగా అధికారులతో చర్చించారు. ఈ ఆరోగ్య శ్రీ(ARogya sri) సేవల కోసం కొత్తగా డిజిటల్ కార్డ్ లని ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనికోసం ఈ kycని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఆరోగ్య శ్రీ సేవలను బయోమెట్రిక్ విధానంలోనే నిర్వహిస్తున్నారు. అయితే వాటి వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫేస్ రికాగ్నైజేషన్ విధానాన్ని తీసుకురావాలని ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఇది పూర్తి స్థాయిలో అమలు కానుంది.