ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కవిత రిట్ పిటిషన్ పైన ఈ రోజు (సోమవారం, 27) న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Excise Policy Case) ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు (BRS Party leader), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును (Supreme Court) ఆశ్రయించిన విషయం తెలిసిందే. కవిత రిట్ పిటిషన్ పైన (kavitha writ petition) ఈ రోజు (సోమవారం, 27) న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. కవిత పిటిషన్ ను జస్టిస్ అజయ్ రాస్తోగీ, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ద్విసభ్య ధర్మాసనం విచారించింది. కవిత తరపున కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఈడీ, కవిత లు లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. గతంలో దాఖలు చేసిన నళినీ చిదంబరం పిటిషన్ కు ఈ కేసును ట్యాగ్ చేసిన కోర్టు… కేసు విచారణను వాయిదా వేసింది. మహిళలను ఈడీ ఆఫీస్ కు పిలిచి విచారణ జరిపే విషయంలో గతంలో నళినీ పిటిషన్ దాఖలు చేశారు. మహిళను ఈడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం పిలువరాదని నిబంధనలు నిర్దేశిస్తున్నాయని, ఆమె విచారణ నివాసంలోనే జరగాలని పేర్కొన్న సుప్రీం కోర్టు పూర్తి వివరాలు సమర్పించాలని పేర్కొన్నది.
ఢిల్లీ మద్యం కేసులో పలువురిని అరెస్టు చేసిన విచారణ సంస్థ ఈడీ.. ఇదే కేసులో కవితను కూడా విచారిస్తోంది. ఆమెను ఢిల్లీలోని కార్యాలయానికి విచారణ నిమిత్తం మూడుసార్లు పిలిచింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా తనను విచారిస్తున్నారని ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను మహిళను కాబట్టి ఇంటి వద్ద విచారించాలని, న్యాయవాది సమక్షంలో, రికార్డ్ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. అలాగే తన పైన తదుపరి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కూడా అందులో పేర్కొన్నారు. అంతేకాదు, మద్యం పాలసీ కేసు విచారణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ను ఏర్పాటు చేయాలని కోరారు.
కవిత, ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిలకు చెందిన బినామీలు అరుణ్ రామచంద్ర పిళ్లై, ప్రేమ్ రాహుల్ లు సౌత్ గ్రూప్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లకు రూ.100 కోట్ల ముందస్తు ముడుపులు చెల్లించి, మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా ఉండేలా ప్రభావితం చేశారనేది ఈడీ అభియోగం. కవితను ఇప్పటికి మూడు పర్యాయాలు విచారించారు.