»Students Lives Are Affected By Paper Leakage Clp Leader Bhatti
KU :పేపర్ లీకేజీ తో విద్యార్థుల జీవితాలతో చెలగాటం : సీఎల్పీ నేత భట్టి
నీళ్లు లేవు.. నిధులు లేవు.. నియమకాలు లేకుండా చేశారని. తెలంగాణకు సింగరేణి ఉద్యోగాల గని.. ఉమ్మడి రాష్ట్రంలోనే లక్ష 20 వేల ఉద్యోగాలున్న సింగరేణిలో ప్రస్తుతం 42 వేల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP leader Bhatti Vikramarka) అన్నారు
పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (CLP leader Bhatti Vikramarka) కాకతీయ యూనివర్సటీకి లో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. యూనివర్సటీల ప్రైవేటీకరణ(Privatization),గ్రూప్ పేపర్ల లీకేజీ, రిజర్వేషన్ల ఇబ్బందులను సమస్యలనుయ సీఎల్పీ నేత దృష్టికి విద్యార్థులు తీసుకువచ్చారు. సూర్యపేట(Suryapet)కు చెందిన రాజశేఖర్ మాట్లాడుతూ.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని.. వారి కోటా వారికి ఇవ్వాల్సిందేనేని . అదే విధానాన్ని చట్టసభల్లో కూడా సీఎం కేసీఆర్ (CM KCR) అమలు చేయాలని కోరారు. వరంగల్ – పీపుల్స్ మార్చ్ (People’s March) పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలు తెసుకుంటున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను.. తమ కష్టాలు, బాధలు తెసుకులనేందుకు ఒక్కసారి కాకతీయ యూనివర్సిటీకి రావాలని ఆహ్వానించారు.
విద్యార్థుల ఆహ్వానం మేరకు వారి ఇబ్బందులు ప్రత్యక్షంగా వారితో మాట్లాడి తెలుసుకునేందుకు యూనివర్సిటీకి భట్టి విక్రమార్క వెళ్లారు. ఉమ్మడి రాష్ట్రంలో కాకతీయ యూనివర్సిటీ (KU) ఒక పెద్ద వర్సిటీగా, ఎన్నో ఉద్యమాలకు, భావజాలాలకు, సామాజిక మార్పులకు వేదికగా నిలిచింది. ఇలాంటి పవిత్ర ప్రాంతంలో నిలబడి మాట్లాడ్డం ఒక అదృష్టంగా నేను భావిస్తున్నా. తెలంగాణలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఊహించలేదు. ఇలాంటి రోజెప్పు రావద్దనే సోనియమ్మ తెలంగాణ (Telangana) ఇచ్చింది. రాష్ట్ర సంపద నాలుగుకోట్ల మందికి పంచబడి, ప్రతి ఒక్కరూ ఆత్మ గౌరవంతో జీవించాలని సోనియమ్మ ఆలోచన చేసింది. సకల సమస్యలకు పరిష్కారం తెలంగాణ ఏర్పాటు మాత్రమే అనుకున్నాం. కానీ ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే ఇప్పుడే సమస్యలు, ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి.