భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు (bjp telangana president), కరీంనగర్ ఎంపీ (karimnagar mp) బండి సంజయ్ (bandi sanjay) శుక్రవారం జైలు నుండి విడుదలయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ (tspsc paper leak case) కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. పదో తరగతి హిందీ ప్రశ్నా పత్రం (ssc paper leak) ఎవరైనా లీక్ చేస్తారా, ముందు రోజు తెలుగు ప్రశ్నా పత్రం ఎవరు లీక్ చేశారు.. చిల్లర బుద్ధులు.. చిల్లర వ్యవహారాలు మీవి కాకుండా ఇంకెవరివి అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (chief minister of telangana) కుమారుడిని పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ పరీక్షలు (tspsc paper leak case) రాసే అభ్యర్థులకు ఒక లక్ష రూపాయలు సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీగా ఉన్న తన పట్ల పోలీసుల తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. పోస్టులు, పైసల కోసమే పోలీసులు పని చేస్తున్నారన్నారు. ఎవరో ప్రశ్నాపత్రం పంపిస్తే ఇందులో తనకు ఏమి సంబంధమో చెప్పాలని నిలదీశారు. పోలీసులు చెప్పింది నిజమైతే కనుక వారు తన మూడు సింహాల టోపీ పైన ప్రమాణం చేసి చెప్పగలరా అన్నారు. నష్టపోయిన టీఎస్పీఎస్సీ అభ్యర్థులతో వరంగల్ లో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు.
పేపర్ లీక్ చేయడానికి, మాల్ ప్రాక్టీస్ కు తేడా తెలియకుండా సీపీ ఉన్నారా అని ఎద్దేవా చేశారు. ఆయన సంగతి తమకు తెలుసని, ఆయన ఎక్కడ ఎక్కడ ఏం చేశారో అంతా తెలుసునని చెప్పారు. పోలీస్ వ్యవస్థను అవమానించేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబంలోనే లీకు వీరులు, లిక్కర్ వీరులు ఉన్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ కవితతో (mlc kavitha) పాటు కేటీఆర్ (ktr) కూడా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. టీఎస్పీఎస్సీ పశ్నా పత్రాల లీకేజీ (tspsc paper leak case) వ్యవహారంపై సిట్టింగ్ జడ్జీతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ ను (minister ktr) పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. అసలు పరీక్షా కేంద్రానికి మొబైల్ తీసుకెళ్లింది ఎవరు? ఫొటో తీసింది ఎవరు.. ఎందుకు చేశారో అన్ని వివరాలు బయటకు రావాలన్నారు. తమకు జైలు, లాఠీ దెబ్బలు కొత్త కాదన్నారు. రేపటి ప్రధాని మోడీ సభతో బీజేపీ బలాన్ని నిరూపిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.