»Serilingampally Youth Leader Raghunath Yadav Joined Congress Party In The Presence Of Rahul Gandhi At Khammam
Raghunath Yadav: రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన శేరిలింగంపల్లి యువనేత
శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ యువనేత మారబోయిన రఘునాథ్ యాదవ్(maraboina raghunath yadav) రాహుల్ గాంధీ(rahul gandhi) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన జనగర్జన సభలో యువనేతకు పార్టీ కండువా కప్పి రాహుల్ గాంధీ పార్టీలోకి ఆహ్వానించారు.
ఖమ్మం(khammam)లో ఆదివారం నిర్వహించిన జనగర్జన భారీ బహిరంగ సభ వేదికగా శేరిలింగంపల్లి నియోజకవర్గ యువనేత మారబోయిన రఘునాథ్ యాదవ్(Maraboina Raghunath Yadav) కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ(rahul gandhi)..రఘునాథ్ యాదవ్ కు కాంగ్రెస్ కుండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన అనంతరం రఘునాథ్ యాదవ్ మాట్లాడారు. కార్యకర్తలు, అనుచరులతోపాటు శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు కాంగ్రెస్ లో చేరినట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇచ్చిన బాధ్యతలను నిర్వస్తిస్తూ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రఘునాథ్ యాదవ్. ఖమ్మం వేదికంగా ఆయనతోపాటు శేరిలింగంపల్లికి చెందిన పలువురు యువకులు, అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
యువనేత రఘునాథ్ యాదవ్(Raghunath Yadav) కాంగ్రెస్ పార్టీలో చేరి, తిరిగి నగరానికి వస్తున్న సందర్భంగా ఆయన అనుచరులు సోమవారం భారీ బైక్ ర్యాలీ(bike rally)కి పిలుపునిచ్చారు. రఘునాథ్ కు స్వాగతం పలుకుతూ నియోజకవర్గంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈ బైక్ ర్యాలీ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియం నుంచి ఆదిత్యా నగర్ వరకు కొనసాగనున్న ఈ ర్యాలీలో స్థానిక యువత, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.